: ఆఫ్ఘనిస్థాన్ బాంబు పేలుడులో గవర్నర్ మృతి
ఆఫ్ఘనిస్థాన్ లోని ఒక మసీదులో సంభవించిన బాంబు పేలుడులో లోగార్ ప్రావిన్స్ గవర్నర్ అర్సల్లా జమాల్ మృతి చెందారు. ఈద్ అల్ అదా పర్వదినం సందర్భంగా, ఆయన మసీదులో ప్రసంగిస్తుండగా ఈ దారుణం జరిగింది. ఈ ఘటనలో మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. గతంలో ఆయన చాలాసార్లు ఆత్మాహుతి దాడుల నుంచి తప్పించుకున్నారు. అర్సల్లా జమాల్ ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ కి అత్యంత సన్నిహితుడు.