: సీమాంధ్రకు ఏం కావాలో చర్చిస్తాం: పనబాక
త్వరలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులంతా సమావేశమవుతామని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి తెలిపారు. ఢిల్లీలో ఆమె మాట్లాడుతూ, తామంతా సీమాంధ్ర ప్రాంతానికి ఏం కావాలన్న దానిపై చర్చిస్తామని అన్నారు. విద్య, ఉద్యోగ, పరిశ్రమలు, నీటి కేటాయింపులపై తమ వాటాలపైనా కూలంకషంగా చర్చిస్తామని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనపై జీఎంవోను ఇంకా కలవలేదని అన్నారు.