: పలు రైళ్లను రద్దు చేసిన ఈస్ట్ కోస్ట్ రైల్వే
ఫైలిన్ తుపాను ప్రభావంతో భువనేశ్వర్ పరిధిలో రైల్వే ట్రాక్ తీవ్రంగా దెబ్బతింది. దీంతో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటించింది. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తాయని తెలిపింది. చెన్నై-హౌరా ఎక్స్ ప్రెస్, చెన్నై-హౌరా మెయిల్ రైళ్లను రద్దు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ముజఫర్ నగర్-యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ 7 గంటలు ఆలస్యంగా నడుస్తున్నట్టు ప్రకటించారు. దీనికి తోడు హౌరా-కన్యాకుమారి ఎక్స్ ప్రెస్ 15 గంటలు, పురూలియా-విల్లుపురం, తిరుపతి-భువనేశ్వర్, షాలిమార్-యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ రైళ్లు 8 గంటలు, యశ్వంత్ పూర్-హౌరా ఎక్స్ ప్రెస్ 12 గంటలు ఆలస్యంగా నడుస్తున్నట్టు తెలిపారు. సంత్రగచ్చి-ఎర్నాకుళం ఎక్స్ ప్రెస్ రైలును ఖరగ్ పూర్ మీదుగా మళ్లిస్తున్నట్టు వెల్లడించారు.