వచ్చే శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వంపై ప్రతి
పక్షాలు అవిశ్వాస తీర్మానం పెడితే ఎదుర్కొనేందుకు
సిద్ధంగా ఉన్నామన్న ముఖ్యమంత్రి కిరణ్ ప్రకటనను మాజీ మంత్రి, కాంగ్రెస్
నేత జేసీ దివాకర్ రెడ్డి స్వాగతించారు. అయితే, సర్కారుపై అవిశ్వాస తీర్మానం
పెట్టాలనుకుంటున్న ప్రతిపక్షాల ఆలోచనపై జేసీ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇది వారి తెలివితక్కువ పనికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. అయితే సభలో పూర్తి బలం ఉంది కాబట్టి మెజార్టీ నిరూపించుకునేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పారు.