: రతన్ గఢ్ తొక్కిసలాటలో పెరిగిన మృతుల సంఖ్య


మధ్యప్రదేశ్ దాతియా జిల్లాలోని రతన్ గఢ్ ఆలయం వద్ద నిన్న చోటు చేసుకున్న తొక్కిసలాటలో మరణించిన వారి సంఖ్య నేడు 115కి చేరుకుంది. కాగా, ఈ ఘటన మానవ తప్పిదం కారణంగానే చోటు చేసుకుందని, నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కాగా, ఘటనపై చౌహాన్ మాట్లాడుతూ, రెండు రోజుల్లో విచారణ నిమిత్తం కమిషన్ నియమిస్తామని వెల్లడించారు. అంతకుముందు ఆయన దాతియా ప్రభుత్వ ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు.

ఆదివారం రతన్ గఢ్ ఆలయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఆలయ సమీపంలోని వంతెనపై భక్తులు బారులు తీరి ఉండగా.. వంతెన కూలిపోతోందంటూ వదంతులు బయల్దేరాయి. దీంతో, పెద్ద ఎత్తున తొక్కిసలాట చోటు చేసుకుంది. పదుల సంఖ్యలో భక్తులు అక్కడిక్కడే మరణించగా, వందలాది మంది గాయపడ్డారు. మరికొందరు పక్కనే నదిలో పడిపోయారు.

  • Loading...

More Telugu News