: ప్రియాంక ఎన్నికల ప్రచారంలో పాల్గొనరు: కాంగ్రెస్ స్పష్టీకరణ


కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తనయ ప్రియాంక వాద్రా లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారంటూ వస్తున్న వార్తలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఈ వార్తలు వట్టి పుకార్లని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అజయ్ మాకెన్ అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, మధ్యప్రదేశ్ లో జరిగిన తొక్కిసలాట దుర్ఘటన నుంచి దృష్టి మరల్చేందుకే ఇలాంటి పుకార్లు లేవనెత్తి ఉంటారని పేర్కొన్నారు. ఇది కొందరు వ్యక్తులు, మరికొన్ని చానళ్ళ పనే అని ఆయన ఆరోపించారు. ప్రియాంక.. అమేథీ, రాయ్ బరేలీ లోక్ సభ నియోజకవర్గాల్లో మాత్రమే ప్రచారం నిర్వహిస్తారని తెలిపారు. అమేథీకి సోనియా, రాయ్ బరేలీకి రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News