: పాక్ కాల్పుల ఉల్లంఘన.. భారత జవానుకు తీవ్ర గాయాలు
పాకిస్థాన్ తీరు మారడంలేదు. ఇటీవలే భారత్, పాక్ ప్రధానులు అంతర్జాతీయ వేదికపై సమావేశమై సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించేందుకు కృషి చేయాలని ఓ నిర్ణయానికి వచ్చినా పరిస్థితిలో మార్పు కనపడడంలేదు. నేడు పాక్ సైన్యం మరోసారి కాల్పుల ఉల్లంఘనకు తెగబడింది. జమ్మూకాశ్మీర్లోని సాంబా సెక్టార్లో పాక్ సైన్యం భారత పోస్టులపై కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో సరిహద్దు భద్రతా దళానికి చెందిన జవానుకు తీవ్రగాయాలైనట్టు తెలుస్తోంది.