: సంజయ్ దత్ కు ఊరట
సంజయ్ దత్ కు మరో 14 రోజుల పాటు ఫర్లాఫ్ (ప్రత్యేక సెలవు) లభించింది. కాలి గాయానికి చికిత్స నిమిత్తం 14 రోజుల సెలవుపై సంజయ్ దత్ ఈ నెల 1న పుణెలోని యరవాడ జైలు నుంచి విడుదలయ్యారు. ఆ గడువు నేటితో తీరిపోతుంది. దీంతో, చికిత్స కోసం మరో 14 రోజులు సెలవు పొడిగించాలంటూ ఆయన చేసిన విజ్ఞప్తిని జైలు అధికారులు మన్నించారు. శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు.. జైలు అధికారులు ఇచ్చే ప్రత్యేక సెలవును ఫర్లాఫ్ అని, కోర్టు ఇచ్చే మధ్యంతర సెలవును పెరోల్ అని పేర్కొంటారు.