: బాబు ఆరోగ్యం కోసం తిరుపతిలో పూజలు


రాష్ట్ర విభజన అంశంపై కేంద్రం వైఖరికి నిరసనగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో నిరాహార దీక్ష చేపట్టగా, పోలీసులు దాన్ని భగ్నం చేసిన సంగతి తెలిసిందే. ఐదు రోజుల పాటు దీక్ష చేయడంతో ఆయన బాగా బలహీన పడడమే గాకుండా కామెర్ల వ్యాధికి గురయ్యారు. ప్రస్తుతం హైదరాబాదులో చికిత్స పొందుతున్నారు. తమ అధినేత త్వరగా కోలుకోవాలని తిరుపతిలో పార్టీ కార్యకర్తలు అలిపిరి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. బాబుకు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలంటూ వందల కొద్దీ కొబ్బరికాయలు కొట్టి ప్రార్థనలు చేశారు.

  • Loading...

More Telugu News