: హైదరాబాద్ బయల్దేరిన బాబు
ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి నుంచి ఈ మధ్యాహ్నం డిశ్చార్జ్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాదు బయల్దేరారు. ఢిల్లీ ఏపీ భవన్లో ఆయన దీక్ష చేస్తుండగా, పోలీసులు భగ్నం చేసి ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. ఆయన ఆసుపత్రిలోనూ దీక్ష కొనసాగించగా, వైద్యులు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించి చికిత్స అందించారు.