: అంధకారంలో 40 గ్రామాలు
విజయనగరం జిల్లా పార్వతీపురం మండలంలో ఫైలిన్ తుపాను గాలుల ప్రభావానికి అరటి, నీలగిరి పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. ఎమ్మార్ నగరం, సంగం వలస, బందలుప్పి తదితర ప్రాంతాల్లో అరటి చెట్లు గెలలతో సహా నేలకొరిగాయి. సూడిగాం, పెదబొండపల్లి ప్రాంతాల్లో నీలగిరి చెట్లు పడిపోయాయి. రహదారులపైనా, విద్యుత్ స్తంభాలపైనా చెట్లు విరిగిపడడంతో 40 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.