: విజయనగరంలో 8 రోజుల కర్ఫ్యూకు నేడు ముగింపు!


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ విజయనగరంలో నిరసన జ్వాల మిన్నంటగా, అక్కడ కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. ఎనిమిది రోజులుగా అమల్లో ఉన్న కర్ఫ్యూకు నేడు ముగింపు పలకనున్నారు. సమైక్యాంధ్ర ఆందోళనల నేపథ్యంలో పీసీసీ చీఫ్ బొత్స ఇంటి ముట్టడి సందర్భంగా హింస చెలరేగింది. దీంతో, పోలీసులు ఉద్యమకారులపై లాఠీ ఛార్జ్ చేయడంతో విజయనగరం అట్టుడికింది. ప్రజలు ఆగ్రహంతో పీసీసీ చీఫ్ బొత్స ఆస్తులపై దాడి చేశారు. పోలీసుల వాహనాలనూ ధ్వంసం చేశారు. దీంతో విజయనగరంలో కర్ఫ్యూ విధించారు. 5 రోజులు పూర్తి కర్ఫ్యూ వాతావరణం నెలకొన్న విజయనగరంలో గత మూడు రోజులుగా కొద్ది కొద్దిగా కర్ఫ్యూ ఎత్తివేస్తూ వచ్చారు. పరిస్థితి ప్రశాంతంగా ఉండడంతో నేడు కర్ఫ్యూ ఎత్తివేసే అవకాశముందని కలెక్టర్ కాంతిలాల్ దండే తెలిపారు. అన్ని శాఖల అధికారులతో సమీక్ష జరిపి దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు.

  • Loading...

More Telugu News