: రాజరాజేశ్వరిదేవిగా దుర్గమ్మ.. సాయంత్రం తెప్పోత్సవం
అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ.. బెజవాడ దుర్గమ్మ విజయదశమి పర్వదినమైన నేడు భక్తులకు శ్రీ రాజరాజేశ్వరీదేవిగా దర్శనమిస్తోంది. తొమ్మిది రోజులుగా జరుగుతున్న దసరా మహోత్సవాలు నేటితో ముగియనుండడంతో భక్తులు భారీ సంఖ్యలో అమ్మ దర్శనానికి తరలివచ్చారు. దీంతో ఆలయం కిటకిటలాడుతోంది. విశేషంగా భావించే తెప్పోత్సవం సాయంత్రం 5 గంటలకు జరుగుతుంది. దీంతో శరన్నవరాత్రి మహోత్సవాలు ముగుస్తాయి.