: ఫైలిన్ ఇంకా పోలేదు..
పెను తుపాను ఫైలిన్ ప్రభావం తగ్గలేదు. ఒడిశాలోని పుల్బని తీరానికి 20 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఈ రోజు మధ్యాహ్నం తర్వాత తుపానుగా, తర్వాత వాయుగుండంగా మారుతుందని వెల్లడించింది. నిన్న రాత్రి 9 గంటలకు ఒడిశాలోని గోపాల్ పూర్ వద్ద ఫైలిన్ తీరం దాటిన సంగతి తెలిసిందే. మరోవైపు విశాఖ సహా తీర ప్రాంతాలలో అలల తీవ్రత హెచ్చుగా ఉంది. ఉత్తరాంధ్ర, ఒడిశాలో ఈ ఉదయం గాలులు గంటకు 110 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. వాయుగుండంగా మారిన తర్వాత గాలులు, అలల తీవ్రత తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు, కళింగపట్నం, భీమిలి, విశాఖ, కాకినాడలో 3వ నంబరు ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు