: తుపాను విలయంపై షిండే ప్రెస్ మీట్
ఫైలిన్ తుపాను తీరాన్ని తాకిన నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ లపై తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని తెలిపారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తీర ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు 12 విమానాలు, 18 హెలికాప్టర్లను సిద్ధం చేసినట్టు చెప్పారు. బాధితుల కోసం ఆహారపొట్లాలు సిద్ధం చేశామన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో కమ్యూనికేషన్ల పునరుద్ధరణ కోసం ప్రత్యేక బృందాలను పంపామని తెలిపారు.