: ఢిల్లీ-భువనేశ్వర్ మధ్య రైళ్లు రద్దు
ఫైలిన్ తుపాను కారణంగా ఢిల్లీ-భువనేశ్వర్ మధ్య నడిచే అన్ని రైళ్లను రద్దు చేసినట్టు ఉత్తర రైల్వే ప్రకటించింది. దీంతో, రేపు బయల్దేరాల్సిన న్యూఢిల్లీ-భువనేశ్వర్.. రాజధాని ఎక్స్ ప్రెస్ (నెం.22812), ఈ నెల 14న బయల్దేరాల్సిన న్యూఢిల్లీ-పూరి.. పురుషోత్తం ఎక్స్ ప్రెస్ (నెం. 12802), న్యూఢిల్లీ-భువనేశ్వర్.. రాజధాని ఎక్స్ ప్రెస్ (నెం.22806), న్యూఢిల్లీ-పూరినందన్.. కణ్ణన్ ఎక్స్ ప్రెస్ (నె.12816) లను రద్దు చేసినట్టు తెలిపింది. ఈ నెల 15న బయల్దేరాల్సిన హరిద్వార్-పూరి ఎక్స్ ప్రెస్ కూడా రద్దయింది.