: ఉత్తర కోస్తాలో అతి భారీ వర్షాలు


భారత తూర్పు తీరాన్ని వణికిస్తోన్న ఫైలిన్ తుపాను తీరాన్ని తాకడంతో వర్షాలు, పెనుగాలులు మొదలయ్యాయి. ఈ తుపాను ప్రభావంతో ఎనిమిది రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశా, ఉత్తరకోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ఒడిశాలోని గంజాం జిల్లాల్లో ప్రస్తుతం 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. కళింగపట్నంలో ఈదురుగాలులతో భారీ వర్షం పడుతోంది. దీంతో, అక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఆరుగంటల పాటు ఈ బీభత్సం కొనసాగుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. బారువా ప్రాంతం నుంచి గంజాం వరకు ఈ ప్రభావం అతి తీవ్రంగా ఉండనుందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News