: చంద్రగిరిలో టీడీపీ కార్యకర్తల నిరవధిక దీక్ష
చిత్తూరు జిల్లా చంద్రగిరిలో సమైక్యాంధ్రకు మద్దతుగా తెలుగుదేశం కార్యకర్తలు నిరవధిక దీక్ష చేపట్టారు. టవర్ క్లాక్ కూడలిలో ఏర్పాటు చేసిన శిబిరంలో వీరు దీక్షకు దిగారు. అయితే, దీక్షా శిబిరంలోని మైక్ సెట్ ను స్థానిక ఎస్సై తొలగించడంతో... పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు వాగ్వివాదం జరిగింది. దీంతో, ఘటనా స్థలానికి వచ్చిన సీఐ టీడీపీ కార్యకర్తలకు సర్దిచెప్పి వారిని శాంతింపజేశారు.