: ఒబామా దంపతులతో మలాలా భేటీ


బాలికల విద్యాహక్కు ఉద్యమకారిణి, పాక్ సాహస బాలిక మలాలా యూసఫ్ జాయ్ (16) ఒబామా దంపతులతో భేటీ అయింది. అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ లో శుక్రవారం ఒబామా, ఆయన సతీమణి మిషెల్లేను మలాలా కలుసుకుంది. ఈ సందర్భంగా బాలికల కోసం మలాలా చేస్తున్న స్ఫూర్తిదాయకమైన కృషిని ఒబామా, మిషెల్లే అభినందించారు. అధ్యక్షుడు ఒబామా, ప్రథమ పౌరురాలు మిషెల్లే.. మలాలాను స్వాగతించారని, పాకిస్థాన్ లో బాలికల విద్య కోసం ఆమె చేస్తున్న కృషిని వారు అభినందించారని వైట్ హౌస్ ప్రకటన జారీ చేసింది. పాఠశాలలకు వెళ్లి చదువుకోవడం ప్రతీ ఒక్క బాలిక హక్కు అన్న మలాలా సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అమెరికా పాక్ ప్రజలతోనూ, ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలతోనూ కలిసి పనిచేస్తుందని వైట్ హౌస్ తెలిపింది.

  • Loading...

More Telugu News