: అక్కడికెళ్తే వజ్రాలే వజ్రాలు...!


మీకు వజ్రాలు కావాలనుకుంటున్నారా... అయితే వెంటనే బయలుదేరండి... ఎక్కడికి అనుకుంటున్నారా... గురు గ్రహానికి లేదా శనిగ్రహంపైకి. అక్కడే బోలెడు వజ్రాలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ గ్రహాల అంతర్భాగంలో వజ్రాలు సమృద్ధిగా దొరికే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

గతంలో గురు, శని గ్రహాలపై అత్యధిక ఉష్ణోగ్రతల వల్ల వజ్రాలుగా గట్టిపడేందుకు అవకాశాలు లేవని భావించారు. అయితే ఈ గురు, శని గ్రహాలపై పీడనం, ఉష్ణోగ్రతలకు సంబంధించిన స్థిరోష్ణ ప్రక్రియపై జరిపిన పరిశోధనల్లో వెల్లడైన వివరాల ఆధారంగా కాలిఫోర్నియా స్పెషాలిటీ ఇంజనీరింగ్‌ శాస్త్రవేత్తలు ఇలా అంచనావేస్తున్నారు. ఈ రెండు గ్రహాల అంతర్భాంగంలో ఏకంగా వజ్రాల కొండలే ఉండే అవకాశం ఉందని, ఆ గ్రహాలపై ద్రవ హైడ్రోజన్‌, ద్రవ హీలియం ప్రవాహాల్లో వజ్రాల తునకలు కూడా ప్రవహిస్తూ ఉండవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News