: బొత్సతో సీమాంధ్ర ఆర్టీసీ కార్మికుల చర్చలు సఫలం: రేపటి నుంచి రోడ్లపైకి బస్సులు
బొత్సతో సీమాంధ్ర ఆర్టీసీ కార్మికుల చర్చలు ఫలించాయి. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం లిఖిత పూర్వక హామీ ఇచ్చింది. దీంతో ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారు. సీమాంధ్ర లో 60 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణ నిర్ణయంతో రేపటి నుంచి ఆర్టీసి బస్సులు రోడ్డెక్కనున్నాయి.