: నడవలేడు, మాట్లాడలేడు.. సచిన్ చివరి మ్యాచ్ చూసేందుకు రెడీ..!


ఆయన నడవలేడు... కనీసం సరిగా మాట్లాడలేడు కూడా. అయితేనేం, 80 ఏళ్ల రమాకాంత్ అచ్రేకర్ తన ప్రియశిష్యుడు సచిన్ చివరి ఆటను ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నాడు. ఈ విషయాన్ని అచ్రేకర్ కూతురు కల్పన తెలిపారు. సచిన్ 200వ టెస్టు మ్యాచ్ ముంబైలో జరిగితే స్టేడియానికి వచ్చి చూడాలనుకుంటున్నారని కల్పన చెప్పారు. సచిన్ రిటైర్మెంట్ ప్రకటించాడని తన తండ్రితో చెబితే ఎంతో బాధ పడ్డారని అన్నారు. సచిన్ ఆడటం మానేస్తే తన తండ్రి క్రికెట్ ను చూడటం కూడా తగ్గించేస్తారని ఆమె అన్నారు.

సచిన్ కూడా తన తండ్రితో రెగ్యులర్ గా టచ్ లో ఉంటాడని కల్పన తెలిపారు. గత నెల్లో కూడా సచిన్ రెండుసార్లు గురువు అచ్రేకర్ ను ఇంటికి వచ్చి కలుసుకున్నాడని.. గురుపౌర్ణమి సందర్భంగా ఆశీస్సులు తీసుకున్నాడని చెప్పారు.

  • Loading...

More Telugu News