: సచిన్ నిర్ణయంతో షారూక్ దిగ్భ్రాంతి
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడం పట్ల బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. సచిన్ ఆటను చూస్తూ, తాను క్రికెట్ కు బానిసనయ్యానని షారూక్ ట్విట్టర్లో పేర్కొన్నాడు. మంచి స్నేహితులైన సచిన్, షారూక్ గతంలో కొన్ని వాణిజ్య ప్రకటనల్లో కలిసి నటించారు. ఈ నేపథ్యంలో సచిన్ రిటైర్మెంటు ప్రకటన షారూక్ ను తీవ్ర నిరాశకు గురి చేసింది. 'సచిన్ లేని క్రికెట్' అన్న ఊహే భరించలేకుండా ఉన్నానని షారూక్ ట్విట్టర్లో కామెంట్ చేశాడు.