: ఆశారాం బాపు కస్టడీ అక్టోబర్ 25 వరకు పొడిగింపు
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు కస్టడీని అక్టోబర్ 25 వరకు పొడిగిస్తూ రాజస్థాన్ లోని ఓ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆశ్రమంలో చదువుకుంటున్న ఓ బాలికపై బాపు లైంగిక దాడికి పాల్పడ్డట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. స్వయంగా ఆ బాలికే పోలీసులకు బాపుపై ఫిర్యాదు చేసింది.