: భారత మ్యాపును తప్పుగా చూపిన వరల్డ్ బ్యాంకు
ప్రపంచ బ్యాంకు కూడా భారత మ్యాపు విషయంలో తప్పులో కాలేసింది! భారత భూభాగాలను చైనా, పాకిస్థాన్ లో భాగంగా చూపించింది. దీనిపై బీజేపీ పార్లమెంటరీ నేత అంతర్జాతీయ వేదికపై నిరసన వ్యక్తం చేశారు. వాషింగ్టన్ లో జరిగిన ఆసియాన్ దేశాల సమావేశంలో ప్రపంచ బ్యాంకు దక్షిణాసియా ప్రాంత ముఖ్య ఆర్థికవేత్త కల్పనా కొచ్చర్ ప్రజంటేషన్ సమయంలో.. నివేదికలో భారత్ మ్యాపును తప్పుగా చూపిన విషయాన్ని బీజేపీ రాజ్యసభ సభ్యుడు తరుణ్ విజయ్ గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత భూభాగాలను పొరుగున ఉన్న చైనా, పాక్ లో భాగం చూపారని, విదేశాంగ మంత్రి వెంటనే ఈ విషయాన్ని ప్రపంచబ్యాంకు దృష్టికి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు.