: పాకిస్థాన్ కు ప్రధాని కావాలనుకుంటున్న మలాలా


పాకిస్థాన్ సాహస బాలిక మలాలా యూసఫ్ జాయ్ తన దేశానికి ప్రధాని కావాలనుకుంటోంది. తన రోల్ మోడల్ బెనజీర్ భుట్టో మాదిరిగా పాక్ ప్రధాని అవ్వాలనుకుంటున్నానని ఆమె తెలిపింది. తద్వారా తన దేశానికి సేవ చేయాలనుకుంటున్నట్లు సీఎన్ఎన్ చానల్ ఇంటర్వ్యూలో పేర్కొంది. ఏడాది క్రితం తాలిబాన్ల దాడితో మలాలా వెలుగులోకి వచ్చిన తర్వాత ఆమెకు స్వదేశంలోనూ, ప్రపంపవ్యాప్తంగానూ ప్రాచుర్యం రోజురోజుకీ పెరిగిపోతోంది. గతంలో డాక్టర్ కావాలన్నది మలాలా స్వప్నం. తాలిబాన్ల దాడి, ప్రపంచవ్యాప్త ప్రాచుర్యం, ప్రముఖుల అభినందలతో ఆమె రాజకీయాల్లోకి రావాలని అనుకుంటోంది. రాజకీయాల ద్వారా దేశమంతటికీ సేవ చేయవచ్చని, చిన్నారుల విద్య కోసం పాటుపడవచ్చని, విద్యలో నాణ్యతను మెరుగుపరచవచ్చని అభిప్రాయపడింది.

  • Loading...

More Telugu News