: 19న జరిగే సమావేశానికి అందరూ వస్తారు: ఆజాద్
రాష్ట్ర విభజన, తెలంగాణ ఏర్పాటు అంశాలను పరిశీలించేందుకు ఏర్పాటైన మంత్రుల బృందం తొలి సమావేశం ముగిసింది. దాదాపు 45 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. ఈ నెల 19న సాయంత్రం 4 గంటలకు మరోసారి సమావేశం కావాలని తొలి సమావేశంలో నిర్ణయించారు. అనంతరం మంత్రి గులాంనబీ ఆజాద్ మీడియాతో మాట్లాడుతూ.. తదుపరి భేటీకి మంత్రులందరూ హాజరవుతారని తెలిపారు. విధివిధానాల పరిధిపై ప్రాధమికంగా చర్చించామని వివరించారు. ఢిల్లీలో జరిగిన ఈ భేటీకి పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు.