: 2057 నాటికి మండిపోనున్న హైదరాబాద్!
మహానగరాలుగా భాసిల్లుతున్న ముంబై, చెన్నైలలో 2034 తర్వాత వాతావరణం ఉడుకెత్తిపోనుంది. అప్పటికి ఈ నగరాలలో ఎండలు తాటతీసే స్థాయికి చేరనున్నాయి. గత 150 ఏళ్లలో చూడనంతటి స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉంటాయని హవాయ్ యూనివర్సిటీ పరిశోధన పేర్కొంటోంది. మన హైదరాబాద్ నగరం కాస్త ఆలస్యంగా 2057లో ఈ స్థాయి వేడిని చవిచూడనుంది. పుణె, సూరత్, జైపూర్, బెంగళూరు, అహ్మదాబాద్ నగరాలలో 2045 నాటికి ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి చేరనున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది.
భిన్న రకాల వాతావరణ మోడళ్లను విశ్లేషించడం ద్వారా పరిశోధకులు ఈ విశ్లేషణకు వచ్చారు. 2047 నాటికి ప్రపంచంలో చాలా వరకు నగరాలలో వాతావరణం గతితప్పనున్నట్లు తేలింది. కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు వెంటనే చర్యలు తీసుకుంటే ముంబైలో ఉష్ణోగ్రతలు 2051 వరకు అదుపులోనే ఉంటాయని పేర్కొంది. హైదరాబాదులో వాతావరణం కూడా ఉద్గారాల తగ్గింపు చర్యల వల్ల 2085 వరకూ సేఫ్ గానే ఉంటుందట.