: 15 రోజుల్లో సీఎం మారిపోతాడు.. రేసులో ఆనం, బొత్స: పాల్వాయి
ముఖ్యమంత్రి 15 రోజుల్లో మారిపోతాడని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, 12 వారాల్లో తెలంగాణ ఏర్పడబోతోందని, మరో 15 రోజుల్లో ముఖ్యమంత్రి మారిపోతున్నాడని అన్నారు. హైదరాబాద్ శాంతిభద్రతలు కేంద్రం పరిధిలో ఉన్నా, తమకు అభ్యంతరం లేదని అసెంబ్లీకి తీర్మానం రాదని, కేవలం నోట్ మాత్రమే వస్తుందని పాల్వాయి స్పష్టం చేశారు. సీఎం రేసులో ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. అటు, కేంద్రం వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే సీమాంధ్రలో 75 వేల మంది అదనపు బలగాలను మోహరించడం, సమ్మెలు విరమింపజేస్తుండడం పాల్వాయి వ్యాఖ్యలకు ఊతం లభిస్తోంది.