: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి ప్రక్రియ మొదలు


రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు నిర్ణయం తీసుకున్న సర్కార్.. జీవో నంబర్ 954ను జారీ చేసింది. దీని సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు, ఆర్టీసీలో ఆర్ధిక పరమైన అంశాల అధ్యయనానికి నలుగురు సభ్యులతో కూడిన ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఇందులో సభ్యులుగా రవాణాశాఖ అదనపు కార్యదర్శి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఆర్టీసీ ఆర్ధిక సలహాదారు, ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రతినిధి ఉంటారు. వంద రోజుల్లో ఈ కమిటీ నివేదిక ఇవ్వాలని సర్కారు ఆదేశించింది. ఈ నిర్ణయం లక్షా 20వేల మంది ఉద్యోగులకు వరం కానుంది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వారికి జీతాలు ఉంటాయి. అటు ఆర్టీసీకి ఉన్న నాలుగువేల కోట్ల అప్పులు కూడా మాఫీ అవుతాయి. ఈ మధ్యాహ్నం ఆర్టీసీ కార్మిక సంఘాలతో రవాణా శాఖ మంత్రి బొత్స సత్యానారాయణ జరిపిన చర్చల సమయంలో ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపారు.

  • Loading...

More Telugu News