: హైదరాబాద్ పేలుళ్లను నివారించడంలో కేంద్రం విఫలం: రాజ్ నాథ్


తీవ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవడంలో్ ప్రధాని మన్మోహన్ సింగ్ విఫలమయ్యారని బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ అన్నారు. హైదరాబాద్, ముంబై బాంబు పేలుళ్లను ముందుగా గుర్తించడంలో నిఘా వైఫల్యముందని చెప్పారు. ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ కార్యవర్గ భేటీలో రాజ్ నాథ్ మాట్లాడారు. బీజేపీ శాంతి, మతసామరస్యాలకు ప్రాధాన్యం ఇస్తుందన్నారు. 

వాజపేయి, అద్వానీ తమ జీవితమంతా పార్టీ కోసమే పని చేశారని కీర్తించారు. సంక్షోభ సమయంలో అద్వానీ నాయకత్వం, మార్గదర్శకత్వం అవసరమని చెప్పారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ఆకాశానికెత్తేశారు. అన్ని దేశాలూ మోడీ అభివృద్ధి గురించే మాట్లాడుకుంటున్నాయని చెప్పారు. మోడీ నాయకత్వంలో గుజరాత్ లో బీజేపీ మూడోసారి విజయం సాధించిందన్నారు. అందరూ మోడీని చప్పట్లతో ప్రశంసించాలని రాజ్ నాథ్ కార్యకర్తలను కోరారు. స్వామి వివేకానందని భారతదేశ తొలి యూత్ ఐకాన్ గా పేర్కొన్నారు. 

  • Loading...

More Telugu News