: సాయంత్రం 6 గంటలకు ఉపాధ్యాయ జేఏసీతో సీఎం చర్చలు
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి విద్యుత్ జేఏసీతో చర్చలు స్ఫూర్తిని కలిగించాయి. దీంతో, ఉపాధ్యాయ జేఏసీ నేతలతోనూ చర్చలు జరపాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో సాయంత్రం 6 గంటలకు వారితో సమావేశం కానున్నారు. విభజన నిర్ణయంతో ఉపాధ్యాయులు గత 60 రోజులుగా ఉద్యమంలో పాల్గొంటున్నారు. దీంతో వీరిని సమ్మెనుంచి విరమింపజేసేందుకు ముఖ్యమంత్రి చర్చలు జరపనున్నారు.