: భారీ వర్షంలోనూ కొనసాగుతున్న 'ప్రజాగర్జన'
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరుగుతున్న ప్రజాగర్జన సభ వర్షంలోనూ కొనసాగుతోంది. తుపాను ప్రభావంతో తీర ప్రాంతానికి దగ్గర్లో ఉన్న భీమవరంలో భారీవర్షం కురుస్తోంది. అయినప్పటికీ సమైక్యవాదులు సభాస్థలి నుంచి కదలడంలేదు. వర్షంలోనే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి.