: ప్రారంభమైన శ్రీహరి అంతిమయాత్ర
కాలేయ సమస్యతో కన్నుమూసిన నటుడు శ్రీహరి అంతిమయాత్ర కొద్దిసేపటి క్రితం జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసం నుంచి ప్రారంభమైంది. ఈ సాయంత్రం ఆయన అంత్యక్రియలు బాచుపల్లిలోని ఫాంహౌస్ లో నిర్వహిస్తారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాగా, శ్రీహరిని కడసారి చూసేందుకు సినీ ప్రముఖలు, అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు.