: కేంద్ర బలగాల సాయం కావాలి: ప.గో. జిల్లా కలెక్టర్
పెను తుపాను హెచ్చరికలు జారీ కావడంతో... మత్స్యకారులు వేటకు వెళ్లరాదని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ స్పష్టం చేశారు. జిల్లాలోని నరసాపురం, మొగల్తూరు, యలమంచిలి, భీమవరం మండలాల్లో తుపాను ప్రభావం అధికంగా ఉన్నట్టు సమాచారం. దీంతో, తీర ప్రాంత అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి కేంద్ర బలగాల సాయం కావాలని ప్రభుత్వాన్ని కోరినట్టు కలెక్టర్ తెలిపారు.