: పొగతాగితే కంటి చూపుకు దెబ్బ
సిగరెట్ల మీద సిగరెట్లు, బీడీలు గుప్పు గుప్పుమంటూ ఊదిపారేస్తే గుడ్డోళ్లుగా మారే ప్రమాదముందట. అవునండీ, పొగతాగే వారు 50 ఏళ్ల వయసు తర్వాత చూపును కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఢిల్లీకి చెందిన ఓ కంటి ఆసుపత్రి డైరెక్టర్ దీపేంద్ర అంటున్నారు. వయసు ఆధారంగా వచ్చే మాక్యులర్ రెటీనా(ఏఎండీ) వల్ల చూపును కోల్పోయే అవకాశం ఉంటుందన్నారు. ఏఎండీ వల్ల రెటీనా సామర్థ్యం తగ్గిపోతుందని.. పొగతాగేవారు, గుండె జబ్బులున్నవారు, అల్ట్రా వయొలెట్ కిరణాలకు గురయ్యేవారు, ఏఎండీ బారిన పడతారని దీపేంద్ర తెలిపారు. కనుక పొగతాగడం మానేసి, అల్ట్రా వయొలెట్ కిరణాలకు నేరుగా గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.