: అమెరికా దాని మిత్రదేశాలను వదిలిపెట్టం: పాక్ తాలిబన్లు
అగ్రరాజ్యం అమెరికా, దానితో అంటకాగే దేశాలను వదిలిపెట్టేది లేదని పాకిస్థాన్ తాలిబన్లు అంటున్నారు. పాక్ లో అమెరికా డ్రోన్ దాడులను ఆపేవరకు అగ్రరాజ్యం తమ ప్రథమ లక్ష్యంగా ఉంటుందని హెచ్చరించారు. తెహ్రీకే తాలిబన్ నేత హకీముల్లా మసూద్ బీబీసీ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ముస్లింలు, ఇస్లాం, మసీదుల పరిరక్షణే ధ్యేయంగా తాము పనిచేస్తున్నామని, దీనికి అడ్డుతగిలితే ఎవరినీ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. అమెరికా డ్రోన్ దాడులను ఆపితే తాము కాల్పుల విరమణ పాటిస్తామని తెలిపారు. చర్చలకు తాము సిద్ధమని చెబుతున్నా, పాక్ ప్రభుత్వం ముందుకు రావడంలేదని మసూద్ ఆరోపించారు.