: త్వరలో భారత మార్కోట్లోకి యాపిల్ టీవీ
అతి త్వరలో యాపిల్ టీవీ భారతీయులకు అందుబాటులోకి రాబోతోంది. మరో రెండు వారాల్లోపే రావచ్చని సమాచారం. ధర రూ.8000 లోపు ఉండవచ్చని భావిస్తున్నారు. యాపిల్ టీవీ అంటే మన ఇంట్లో ఉండే లాంటిది కాదండోయ్. ఇదొక చిన్న పరికరం. టీవీకి కనెక్ట్ చేసి, యాపిల్ ఐ ట్యూన్స్ స్టోర్ లో ఉన్న వీడియోలు చూసుకోవడానికి వీలు కలుగుతుంది. అలాగే మీ దగ్గర యాపిల్ ఐ పాడ్, ప్యాడ్, ఐ ఫోన్ ఇలా ఏవైనా ఉంటే వాటిలోని వీడియోలను కూడా టీవీ ద్వారా ఇంట్లో అందరూ వీక్షంచవచ్చు.