: అండమాన్ లో తీరం దాటిన వాయుగుండం
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అండమాన్ తీరాన్ని దాటింది. అయితే, ఇది 12 గంటల్లోగా తుపానుగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని ప్రభావం రాష్ట్రంపై పడే అవకాశం ఉంది. అందుచేత లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖాధికారులు హెచ్చరిస్తున్నారు.