: చంద్రబాబును పరామర్శించిన కుటుంబ సభ్యులు
ఢిల్లీ ఏపీ భవన్ లో దీక్ష చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబును కుటుంబ సభ్యులు పరామర్శించారు. భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి దీక్షా స్థలానికి వచ్చి బాబు ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. తెలుగు ప్రజలకు న్యాయం చేయాలని కోరుతూ మూడు రోజుల నుంచి ఆయన దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే.