: విజయనగరంలో రేపు నాలుగు గంటల కర్ఫ్యూ సడలింపు
సమైక్యాంధ్ర ఆందోళనలతో అట్టుడికిన విజయనగరంలో పరిస్థితులు కొద్దిగా చక్కబడినట్లు కనిపిస్తోంది. దాంతో, రేపు నాలుగు గంటల పాటు కర్ఫ్యూ సడలిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే తెలిపారు. కొద్దిరోజులుగా ఇక్కడ కర్ఫ్యూ విధించడంతో ప్రజల సాధారణ జీవనం కష్టతరంగా మారింది. దాంతో, అందరూ ఇళ్ళకే పరిమితమయ్యారు. కాబట్టి, రోజుకు కొన్ని గంటలు ఇలా కర్ఫ్యూను సడలిస్తున్నారు.