: ఉత్తరాఖండ్ వరద బాధితులకు ఎయిర్ ఫోర్స్ భారీ విరాళం
ఈ ఏడాది జూన్ నెలలో ఉత్తరాఖండ్ లో సంభవించిన భారీ వరదల నుంచి బయటపడ్డ 23 వేల మంది బాధితుల సహాయార్థం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎనిమిది కోట్ల 3 లక్షల రూపాయల విరాళాన్ని అందజేసింది. ఈ మేరకు చెక్ ను ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఎయిర్ చీఫ్ మార్షల్ ఎన్ఎకె బ్రౌనే (మంగళవారం) అందించారు. అనంతరం విరాళాన్ని ప్రధాని సహాయనిధికి తరలించారు. ఈ మొత్తాన్ని ఎయిర్ ఫోర్స్ లో ఉన్న లక్షా ఏడువేల మంది అధికారులు, ఇతర సిబ్బంది జీతాల నుంచి పోగుచేసినట్లు అధికారులు తెలిపారు.