: ఎన్నికల వేడి రగిలించిన రాహుల్


కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల వేడి రగిలించారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ రాజకీయాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు జాతి, కులం ఆధారంగా ప్రజల్లో చీలికలు తెచ్చేందుకు యత్నిస్తున్నారని పరోక్షంగా అఖిలేశ్ సర్కారుపై ఆరోపణలు చేశారు. ముజఫర్ నగర్ లోని హిందు, ముస్లిం ప్రజలతో తాను మాట్లాడానని, తమ మధ్య ఎలాంటి శత్రుత్వం లేదని వారు తెలిపారన్నారు. అల్లర్లు రాజకీయ పార్టీల పనే అని వారు చెప్పారని వివరించారు. రాజకీయ లబ్ది పొందేందుకే ప్రతి ఒక్కరూ ఇలా చేస్తున్నారని రాహుల్ పేర్కొన్నారు. ప్రజల మధ్య కుల చిచ్చు పెట్టకుండా ఎన్నికల్లో గెలవలేమన్న భావనతోనే వారు అలా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కేవలం కాంగ్రెసే ఉత్తరప్రదేశ్ ను మార్చగలదని అన్నారు. యూపీలోని అలీగఢ్ లో ఓ ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News