: బాపిరాజును కలిసిన తిరుమల అర్చకులు
ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక జీవో ఇప్పుడు తిరుమల అర్చకులకు చెమటలు పోయిస్తోంది. 65 ఏళ్ల వయసు నిండిన అర్చకులను ఉద్యోగ బాధ్యతల నుంచి తప్పించవచ్చంటూ గతేడాది అక్టోబర్ లో ప్రభుత్వం జీవో 612ను జారీ చేసింది. అనంతరం ఈ జీవో ప్రకారం ఇద్దరు టీటీడీ అర్చకులు ఇప్పటికే ఉద్యోగ విరమణ చేయాల్సి వచ్చింది. మరో ముగ్గురు ప్రధాన అర్చకులు, 12 మంది అర్చకులను కూడా విధుల నుంచి తప్పించనున్నారు. దీంతో వారిలో గుబులు మొదలైంది.
ఈ నేపథ్యంలో కొంతమంది అర్చకులు ఈ రోజు టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజును కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమకు న్యాయం చేయాలని కోరారు. దాంతో శనివారం జరిగే పాలకమండలి సమావేశంలో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
- Loading...
More Telugu News
- Loading...