: విమానాశ్రయాలకు సమ్మె సెగ


ఇప్పటిదాకా రైల్వేలను తాకిన సమైక్య సెగ ఇప్పుడు సీమాంధ్రలో ఉన్న ఎయిర్ పోర్టులనూ తాకింది. విమానాశ్రయాలకు కూడా విద్యుత్ సరఫరా అంతంతమాత్రంగానే ఉండటంతో... విమాన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్టు పరిస్థితి మరింత దిగజారింది. ఇక్కడ కరెంటు ఎప్పుడు వస్తుందో... ఎప్పుడు పోతుందో అర్థం కాకుండా ఉందని విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకైతే జనరేటర్ తో నెట్టుకొస్తున్నామని... ఇదే పరిస్థితి ఇకపై కొనసాగితే కష్టమని అన్నారు. జనరేటర్ కు అవసరమైన డీజిల్ ను సరఫరా చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ కు లేఖ రాశామని తెలిపారు. ఈ రోజు ఉదయం నుంచి రెండు విమానాలు వెళ్లాయని... సాయంత్రం పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలని అధికారులు అంటున్నారు.

  • Loading...

More Telugu News