: జగన్ గూటికి మరో ఎమ్మెల్యే


కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. రాష్ట్ర విభజన దిశగా కాంగ్రెస్ పార్టీ తప్పుడు నిర్ణయం తీసుకుందని, అందుకే, సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న వైఎస్సార్సీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఆదినారాయణ రెడ్డి తెలిపారు. ప్రజల అభివృద్ధి కోసమే ఇంతకాలం కాంగ్రెస్ లో ఉన్నానని వివరించారు. హైదరాబాదులో నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆదినారాయణ రెడ్డి ఈ రోజు సాయంత్రం ఆ పార్టీలో చేరనున్నారు.

  • Loading...

More Telugu News