: ఈ చిట్టికి స్పీడెక్కువ


ఇప్పుడు ఎక్కువగా రోబోల యుగం నడుస్తోంది. చాలా పనులను చేయడానికి రోబోలను ఉపయోగిస్తున్నారు. వయసుమీరిన వారికి సాయం చేయడానికి, ఇంట్లో పలు రకాలైన పనులను చేయడానికి రోబోలను ఉపయోగిస్తున్నారు. అయితే రోబోలు చాలా నెమ్మదిగా నడుస్తాయని మనలో చాలామందికి తెలుసు. అందుకే, పరుగెత్తే రోబోలను పరిశోధకులు తయారుచేశారు. ఈ సరికొత్త రోబో ఎంత వేగంగా అంటే, గంటకు పాతిక కిలోమీటర్ల దూరం పరుగెత్తగలదట.

అమెరికాలోని బోస్టన్‌ డైనమిక్స్‌ అనే కంపెనీవారు ఒక కొత్తరకం రోబోను రూపొందించారు. ఈ రోబో గంటకు 25 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తగలదట. ఇంత వేగంగా పరుగెత్తడం ఈ రోబో ప్రత్యేకత. దీనిపేరు వైల్డ్‌క్యాట్‌. పేరుకు తగ్గట్టే పరుగెత్తగలిగే ఈ రోబో సైన్యానికి, సంరక్షణ చర్యలకు చక్కగా ఉపయోగపడుతుందని దీని రూపకర్తలు చెబుతున్నారు. ఎత్తు పల్లాలతో కూడిన అన్ని రకాలైన మైదానాల్లోను ఇది చక్కగా పరుగులు తీయగలదట.

  • Loading...

More Telugu News