: అలముకొంటున్న చీకట్లు.....


సీమాంధ్రలో ఉద్యమం హోరెత్తుతోంది. విద్యుత్ ఉద్యోగుల మద్దతుతో సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రరూపు దాల్చింది. సీమాంధ్రలోని 13 జిల్లాల్లో మంచినీరు లేక ప్రజలు అల్లాడుతున్నారు. విద్యుత్ దీపాలు వెలగక ప్రజలు చీకట్లలో మగ్గిపోతున్నారు. ఆసుపత్రులకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రోగులు బాధలు పడుతున్నారు. కాగా, విద్యుత్ ఉద్యోగుల సమ్మె కారణంగా సీమాంధ్రతో పాటు తెలంగాణ జిల్లాల్లో 4,200 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. వీటీపీఎస్ లో 1760 మెగావాట్లు, ఆర్టీపీపీలో 840 మెగావాట్లు, శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో 770 మెగావాట్లు, ఎగువ సీలేరులో 240, సాగర్ కుడి గట్టులో 90, ల్యాంకోలో 100 మెగావాట్ల ఉత్పత్తి నిలిచిపోయింది.

33 కేవీ స్టేషన్లు ట్రిప్ కావడంతో 220 కేవీ స్థాయి కేంద్రాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు, కేంద్ర ప్రభుత్వ విద్యుదుత్పత్తి సంస్థల్లో బొగ్గు కొరతతో 700 మెగావాట్ల ఉత్పత్తి ఆగిపోయింది. విద్యుత్ కొరతను తీర్చేందుకు అదనంగా 600 మెగావాట్ల విద్యుత్ ను బహిరంగ మార్కెట్ నుంచి కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 235 మిలియన్ యూనిట్లు కాగా సరఫరా 209 మిలియన్ యూనిట్లుగా ఉంది.

  • Loading...

More Telugu News