: పృథ్వి-2 క్షిపణి రెండోసారి ప్రయోగం
పృథ్వి-2 క్షిపణిని శాస్త్రజ్ఞులు నేడూ ప్రయోగించారు. ఒడిశాలోని చండీపూర్ టెస్ట్ రేంజి నుంచి దీనిని ప్రయోగించారు. ఉపరితలం నుంచి ఉపరితలానికి అణ్వాయుధాలను మోసుకెళ్లగల, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఈ క్షిపణిని సాధారణ పరీక్షల్లో భాగంగా విజయవంతంగా ప్రయోగించారు. నిన్న కూడా ఈ మిస్సైల్ ను విజయవంతంగా ప్రయోగించిన సంగతి తెలిసిందే.