: మాయావతి కేసు మూసివేతకు సీబీఐ నిర్ణయం
బీఎస్పీ అధినేత్రి మాయావతి కేసును మూసివేయాలని సీబీఐ నిర్ణయించింది. ఉత్తరప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కాలంలో అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకున్నారన్న ఆరోపణలపై సీబీఐ మాయావతిపై దర్యాప్తు చేపట్టింది. మాయావతి 2007 నుంచి 2012 వరకు యూపీ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ చేతిలో పరాజయం చవిచూశారు. ప్రస్తుతం ఆమె రాజ్యసభ అభ్యురాలిగా ఉన్నారు.